
దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వేగంగా విస్తరిస్తుండటంతో అక్టోబర్ తొలి వారంలో జరగనున్న ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 61 మంది సీనియర్ ఎకనామిస్టుల్లో 60 శాతం మంది అక్టోబర్ 5-7 తేదీల్లో జరిగే సమావేశంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
ఈ రేట్లు పెరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి నెలవారీ ఈఎంఐలు ప్రియం కానున్నాయి.