
బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా చొరవతో 40 ఎకరాల బీడు భూమిని అత్యాధునిక క్రికెట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చారు.
2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులు ప్రారంభించగా, 2024 నవంబర్‌లో ఈ కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో నిర్మించిన ఈ కేంద్రం, పాత నేషనల్ క్రికెట్ అకాడమీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది.