
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు వృద్ధాప్యంలో ఉన్న తనకు తమ్ముడి నుండి ఆర్థిక సహాయం కంటే ఆత్మీయ పలకరింపు కావాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరుగురు అన్నదమ్ములలో నలుగురు మరణించగా ప్రస్తుతం తామిద్దరమే మిగిలామని, బ్రహ్మంగారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న తనకు కూతుళ్లే అన్నం పెడుతున్నారని తెలిపారు.
గతంలో తన ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లకు ఒక్కొక్కదానికి రూ. 50 వేలకు పైగా ఖర్చు చేసి, ఇల్లు కూడా కట్టించిన తమ్ముడు బ్రహ్మానందంపై తనకు ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు.