
తమిళనాడు తంజావూరు జిల్లాకు చెందిన శివగురు ప్రభాకరన్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సివిల్స్‌లో విజయం సాధించారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నతనంలో మూటలు మోస్తూ, కట్టెలు కొడుతూ, కూలీగా పనిచేస్తూ తన చదువును కొనసాగించారు.
రైల్వే స్టేషన్లలో నిద్రిస్తూ పట్టుదలతో చదివిన ఆయన, నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ అధికారిగా ఎంపికై ఆదర్శంగా నిలిచారు.