
2,545 మెగావాట్ల సోలార్ విద్యుత్తును 25 ఏళ్ల కాలానికి కొనుగోలు చేసే ఒప్పందంపై డిస్కమ్‌లు టీజీఈఆర్‌సీకి దరఖాస్తు చేశాయి.
ఈ ఒప్పందాల వల్ల ట్రేడింగ్ మార్జిన్ రూపంలో రూ.741 కోట్ల భారం వినియోగదారులపై పడుతుందని విద్యుత్తు రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల కమిషనింగ్‌లో ఆలస్యం, ట్రాన్స్‌మిషన్ చార్జీల పెంపు వంటి సమస్యల వల్ల డిస్కమ్‌లకు ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు.