
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్యకు నిరసనగా ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించనున్నాయి.
ఈ కేసులో ఇద్దరు మైనర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ. 1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇప్పటికే ఆప్షనల్ హాలిడే ఉండగా, ఈ బంద్ పిలుపుతో ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఖరారైంది.