
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈ నెల 9 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను చేపడతారు.