క్యూ2 ఫలితాల తర్వాత నవంబర్ 2వ తేదీ ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా లాభపడటంతో ముకేశ్ అంబానీ నికర ఆస్తి విలువ ఒక్క రోజే 7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.58 వేల కోట్లకు పైగా పెరిగింది.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం ఆయన సంపద 7.85 శాతం మేర పెరగడంతో ఒక్కరోజులో అత్యధిక సంపద ఆర్జించిన బిలియనీర్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ భారీ ర్యాలీతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్న అంబానీ, ప్రపంచ బిలియనీర్లలో 23వ స్థానంలో నిలిచారు.