
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ బద్దలు కొట్టగలడని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం 307 ఇన్నింగ్స్‌ల్లో 14,208 పరుగులు చేసిన రూట్.. సచిన్ పేరిట ఉన్న 15,921 పరుగుల రికార్డుకు చేరువవుతున్నాడు.
సచిన్ రికార్డును అధిగమించడానికి రూట్ ఇంకా 1,713 పరుగులు చేయాల్సి ఉందని విశ్లేషకులు తెలిపారు.