
పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత లెగ్ స్పిన్నర్ మేసన్ క్రేన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కగా, యువ పేసర్ హెన్రీ క్రోకోంబ్ కూడా ఎంపికయ్యాడు.
దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్-2027 సన్నాహకాల్లో భాగంగా అక్టోబర్ 9 నుంచి పాకిస్థాన్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.