ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం రానున్న రోజుల్లో బలపడి అక్టోబర్ 30 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.