
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-ఏ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత-ఏ జట్టు కెప్టెన్ యస్తిక భాటియా 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.
మొత్తంగా 84 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి యస్తిక ఔటవ్వగా, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో తేజల్ హసబ్నిస్ (60), అనుష్క శర్మ (60 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు.