
నలుగురిలో కూర్చున్నప్పుడు దోమలు ఒకరినే ఎంచుకుని కుట్టడానికి తీపి రక్తం సిద్ధాంతం కాకుండా కొన్ని బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్, శరీర వేడి, చెమటలోని లాక్టిక్ యాసిడ్ వంటి వాసనలు దోమలను ఆకర్షిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఓ గ్రూప్ రక్తం ఉన్నవారిని దోమలు రెట్టింపు స్థాయిలో కుడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించగా, ఇవి డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.