
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు, తల్లిదండ్రులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సర్పంచ్ బాస శ్రావణ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడి మానసిక స్థితి సరిగా లేదని, పాఠశాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగస్టు 6న పాలకవర్గం లేఖ రాసింది.
ఈ ఫిర్యాదుపై స్పందించిన డీఈఓ రాము, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.