
బీజేపీని అధికార పీఠం నుంచి దించే వరకు తన పోరాటం ఆగదని, రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ఎన్ఆర్‌సీ అమలు చేసేందుకే కేంద్రం జనగణనను సాకుగా వాడుకుంటోందని, దరఖాస్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయంలోని ఘర్షణల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపిస్తూ, ఓటర్ల జాబితా తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె తెలిపారు.