
ఇజ్రాయెల్‌ను విమర్శించే విదేశీయులను అమెరికా నుంచి బహిష్కరించే అధికారం లేదని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి నోయెల్ వైస్ స్పష్టం చేశారు.
భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇమిగ్రేషన్ అధికారుల చర్యలను కోర్టు తప్పుబట్టింది.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య మనుగడకు కీలకమని పేర్కొన్నారు.