
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాల వల్లే జట్టు నిలకడలేమి ప్రదర్శనను ఎదుర్కొంటోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆరోపించారు.
బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు చేయడం వల్ల జట్టు ఆటగాళ్లు స్థిరత్వాన్ని కోల్పోతున్నారని వాట్సన్ అభిప్రాయపడ్డారు.
గంభీర్ హయాంలో భారత్ వైట్ బాల్లో రాణించినప్పటికీ టెస్టుల్లో సొంతగడ్డపై సిరీస్లను కోల్పోయిందని పేర్కొన్నారు.