
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
బీపీ పడిపోవడంతో మంత్రి ఒక్కసారిగా స్పృహతప్పి పక్కకు వాలిపోగా, భద్రతా సిబ్బంది ఆయనను పట్టుకుని వైద్యులకు సమాచారం అందించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించగా, మిగిలిన ప్రసంగాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కొనసాగించారు.