
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో మైక్రోసాఫ్ట్ నిర్మిస్తున్న డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతంలోకి శుక్రవారం ఆందోళనకారులు చొరబడ్డారు.
పోలీసులతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సుమారు 150 నుంచి 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డేటా సెంటర్ల వల్ల నీరు, విద్యుత్తు విపరీతంగా వినియోగమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళనకారులు ఆరోపించారు.