గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించారు.
సుదర్శన్ రెడ్డికి ప్రపంచస్థాయి వైద్యం అందించాలని కోరిన కేసీఆర్, చికిత్స ఖర్చు విషయంలో పార్టీ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
వైద్యుల సమాచారం ప్రకారం, ఆయన అవయవాలు స్పందిస్తున్నప్పటికీ మెదడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని వైద్య బృందం తెలిపింది.