
ఖమ్మం జిల్లా గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ. 25 లక్షలు మంజూరు చేశారు.
సీఎం ఆదేశాల మేరకు ఖమ్మం కలెక్టర్ దివాకర్ పాఠశాలను సందర్శించి, శిథిల భవనాల స్థానంలో కొత్త తరగతి గదులను నిర్మించాలని అధికారులకు సూచించారు.
పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయిని ఇందిరను అధికారులు అభినందించగా, నిధుల విడుదలతో పాఠశాల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.