బాలును గేటు వద్దే ఆపి అవమానించిన సంజయ్, నీలకంఠంల తీరుపై మీనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని క్షమాపణలు చెప్పించేలా చేస్తానని శపథం చేసింది.
సంజయ్ జూనియర్ ఆర్టిస్టులతో ఫోటో షూట్ చేసుకుంటూ రాఖీ పండుగ గురించి గొప్పగా మాట్లాడుతుండగా, మీనా, శ్రుతి అక్కడికి చేరుకుని కౌంటర్లు వేశారు.
సంజయ్ ప్రవర్తనను ఎండగడుతూ మీనా రికార్డ్ చేసిన వీడియోను శ్రుతి బయటపెట్టడంతో, రాజకీయ ప్రవేశం చేసిన మొదటి రోజే పరువు పోతుందనే భయంతో నీలకంఠం ఆందోళన చెందాడు.