
సుమారు రూ.4000 కోట్లతో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాను చూడకుండా ట్రోల్ చేయడం సరికాదని నటుడు యశ్ అన్నారు.
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.
సినిమాపై నిర్మాణాత్మక విమర్శలు ఉండొచ్చని, కానీ ముందుగానే తప్పుబట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.