
సెకండ్ హ్యాండ్ బట్టల వ్యాపారం ముసుగులో గుజరాత్‌కు మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
అహ్మదాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి సుమారు రూ. 6 లక్షల విలువైన 2,736 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.