
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని అమీర్పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి.
ఐటీ కారిడార్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి.
నగరంలోని రోడ్లపై ఉన్న గుంతల వల్ల వాహనాలు అదుపు తప్పుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.