హిందుస్థాన్ కాపర్ సంస్థలో 6 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (OFS) ప్రక్రియను చేపట్టింది.
తొలి రోజు సంస్థాగత మదుపరుల నుంచి మంచి స్పందన రావడంతో, గ్రీన్ షూ ఆప్షన్ కింద అదనంగా మరో 3 శాతం వాటాను విక్రయిస్తోంది.
ప్రభుత్వం ఈ వాటా విక్రయం ద్వారా సుమారు రూ. 3 వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.