
వరల్డ్ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్‌షిప్ పురుషుల హైజంప్ విభాగంలో భారత అథ్లెట్ బసంత్ 2.21 మీటర్ల ఎత్తును అధిగమించి రజత పతకాన్ని సాధించాడు.
హైజంప్ విభాగంలో భారత్‌కు ఇది చరిత్రలో తొలి పతకం కాగా, అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచీ కూడా 2.21 మీటర్ల ఎత్తుతో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ లాంగ్ జంప్‌లో కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుని అథ్లెటిక్స్ రంగంలో తన సత్తాను చాటింది.