
ముషీరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలతో బీజేపీ బూత్ ఏజెంట్ బాలుచందర్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బాగ్ లింగంపల్లి బూత్ నంబర్ 210లో ఫారమ్ 7 సమర్పించి, ఒకే వర్గానికి చెందిన 31 మంది ఓటర్లను తొలగించాలని బీఎల్ఓను బాలుచందర్ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించగా, ఎన్నికల నమోదు అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.