తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 73.3 లక్షల మంది ఓటర్లు ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) కేటగిరీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
ఈ ఏఎస్‌డీడీ ఓటర్లలో 58.6 శాతం మంది అంటే 43 లక్షల మంది కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే.
హైదరాబాద్ జిల్లాలో గతంలో ఉన్న ఓటర్లలో 40.9 శాతం మంది ఏఎస్‌డీడీ జాబితాలోకి వెళ్లగా, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో ఈ సంఖ్య 42.6 శాతంగా నమోదైంది.