
2027 ఫిబ్రవరిలో జరగనున్న మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంక నుంచి తరలించేందుకు ఐసీసీ సిద్ధమైంది.
శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం, పరిపాలనా లోపాల కారణంగా ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం.
ఆరు జట్లతో జరగనున్న ఈ టోర్నీని భారత్‌లో నిర్వహించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.