
రాష్ట్రంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది.
వివిధ వర్గీకరణల కింద ఉన్న మొత్తం 9.09 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌పై ఇప్పటివరకు కొనసాగిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేసింది.
ఈ నిర్ణయం ద్వారా నిబంధనలకు లోబడి ఉన్న లక్షలాది ఎకరాల భూముల క్రయవిక్రయాలకు మార్గం సుగమమైంది.