
అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం మరియు డాలర్ బలహీనపడటంతో దేశీయంగా బంగారం ధరలు మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,500గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,63,090గా నమోదైంది.
నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ.1400, 24 క్యారెట్ల బంగారంపై రూ.1520 మేర ధరలు పెరిగాయి.