
చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు టిక్‌టాక్ సంస్థ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ కేసు పరిష్కారం కోసం టిక్‌టాక్ సుమారు రూ. 3,800 కోట్లు (400 మిలియన్ డాలర్లు) చెల్లించనున్నట్లు సమాచారం.
అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్తో జరిగిన ఈ ఒప్పందం ద్వారా టిక్‌టాక్ తనపై ఉన్న ఆరోపణలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది.