
ఆసియా క్రీడల క్రికెట్లో నేపాల్ జట్టు అఫ్గానిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నేపాల్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ 17.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.