
దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన 'ఇరుముడి' చిత్రంలో హీరో రవితేజ అరటి రైతు త్రినాథ్ పాత్రలో ఒక ఆడపిల్ల తండ్రిగా అద్భుత నటనను కనబరిచారు.
సీలేరు డ్యామ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రవితేజ భార్య కావేరిగా ప్రియా భవానీ శంకర్, కూతురు మణికంఠగా నక్షత్ర, గురుస్వామిగా సాయికుమార్ నటించారు.
జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రథమార్ధంలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామాగా సాగి, ద్వితీయార్ధంలో ఊహించని ట్విస్టులతో క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది.