
విశాఖపట్నంలో పీవీ సింధు క్రీడా అకాడమీ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ అధికారికంగా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేశ్ విశాఖ పర్యటనలో భాగంగా ఈ క్రీడా ప్రాజెక్టుకు పునాది రాయి వేయడం జరిగింది.