
హంగేరీలో జరిగిన ప్రతిష్ఠాత్మక కెనిజ్సా ఓపెన్ 2026 గ్రూప్-ఎ టైటిల్‌ను 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణేశ్ ఎం సొంతం చేసుకున్నాడు.
చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన వాదిమ్ పెట్రోవ్‌స్కీపై విజయం సాధించిన ప్రణేశ్, తొమ్మిది రౌండ్లలో 7 పాయింట్లతో టైబ్రేక్ ఆధారంగా ఛాంపియన్‌గా నిలిచాడు.
ప్రస్తుతం 2673 రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న ప్రణేశ్, ఈ విజయంతో అంతర్జాతీయ చెస్ వేదికపై తన సత్తా చాటాడు.