
నాగాలాండ్‌తో దిమాపుర్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ సుతార్ అజేయంగా 400 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.
తన రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న 29 ఏళ్ల సుతార్, రంజీ ట్రోఫీలో పృథ్వీ షా పేరిట ఉన్న 379 పరుగుల రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు మైలురాయిని దాటేశాడు.
ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌లో సుతార్ 517 బంతులు ఎదుర్కొని 46 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగగా, మిజోరం తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 581 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.