
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ-ఏఐఎంఎల్ కోర్సులో 83.81 శాతం సీట్లు భర్తీ కాగా, కోర్ సీఎస్‌ఈలో 69.99 శాతం సీట్లు నిండాయి.
రాష్ట్రవ్యాప్తంగా 247 కాలేజీల్లో ఉన్న 1,51,312 సీట్లలో 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.
ఈసీఈలో 18,286 సీట్లు, మెకానికల్‌లో 4,865 సీట్లు భర్తీ అయ్యాయని, 28 కోర్సుల్లో వంద శాతం సీట్లు నిండాయని గణాంకాలు చెబుతున్నాయి.