ఖమ్మం జిల్లాలో జలుబు చికిత్స కోసం ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థిని ఇంజెక్షన్ వికటించడంతో మృతి చెందింది.
వైద్యం అందించిన ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
స్థానిక అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించగా, ఆర్ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.