
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రధాన లబ్ధిదారు అని మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ ఆరోపించారు.
నిబంధనలు మార్చి, కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల ద్వారా జగన్‌కు సుమారు రూ.3,200 కోట్లు చేరాయని ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో వెల్లడించారు.
ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరుల పాత్ర ఉందని పేర్కొన్న సత్యప్రసాద్ వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు.