
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జడ్పీబాలికల హైస్కూల్లో తెలంగాణలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో టీచర్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో మాట్లాడింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద రూ.10 లక్షలతో ఈ ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోను పాఠశాలకు అందించారు.
ఇండస్ సంస్థ ప్రతినిధులు ఈ పాఠశలలో ఐదుగురు ఉపాధ్యాయులకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.