Indian Politics
లిక్కర్ కుంభకోణం సీఎంవోకు తెలుసు: రజత్ భార్గవ వాంగ్మూలం

లిక్కర్ కుంభకోణం సీఎంవోకు తెలుసు: రజత్ భార్గవ వాంగ్మూలం

Andhrajyothy54m
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రూ.3500 కోట్ల మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందని అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ విజయవాడ కోర్టులో వాంగ్మూలమిచ్చారు.

2

లిక్కర్ దందా మొత్తం సీఎంవో నుంచే జరిగిందని, అక్రమాలపై అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డికి 50-60 సార్లు చెప్పినా పట్టించుకోకుండా మెమోలు ఇచ్చిన తనపైనే ఒత్తిడి తెచ్చారని తెలిపారు.

3

ఆర్డర్ ఫర్ సేల్ అధికారాలను తన నుంచి లాగేసుకొని వాసుదేవరెడ్డికి, సత్యప్రసాద్‌కు కట్టబెట్టారని, సీఎంవో నుంచి ఒత్తిడి రావడంతో మౌనంగా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు.