
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మకే వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంపై సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో విజయం సాధించగా, బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్ ల్లో కనీసం 100 పరుగులు చేయలేకపోయింది.
భారత్ లో ఇలా జరిగి ఉంటే దుమ్మెత్తిపోసేవారని, కానీ ఆస్ట్రేలియాలో ఇలాంటి పిచ్ లపై ఎవరూ మాట్లాడరని గవాస్కర్ తన కాలమ్ లో అసహనం వ్యక్తం చేశారు.