తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది మహిళలు క్రాష్ డైటింగ్ చేస్తుంటారు.
దీనివల్ల శరీరానికి అవసరమైన కేలరీలు అందక హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తహీనత, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.