
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో సీబీఐ అధికారులు విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికను పరిశీలించి వివరాలు సేకరించారు.
మే నుంచి జూన్ నెలాఖరు వరకు దహన సంస్కారాలకు వచ్చిన శవాల వివరాలు, సీసీ కెమెరాల సర్వర్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి నిందితులు పులివెందుల సురేశ్ కుమార్, కోనేటి వెంకటరాజు ఇళ్లల్లో సోమవారం ఉదయం సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.