
పాకిస్థాన్‌కు చెందిన 28 ఏళ్ల ప్రముఖ టిక్‌టాకర్ షమ్సో బీబీ ఆగస్టు 14న టాక్సిలా నగరంలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించారు.
కారులో ప్రయాణిస్తున్న షమ్సో బీబీపై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపగా, ఆమె మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందగా, సోదరి అసీమా గాయపడింది.
ఆర్థిక వివాదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపించగా, రావల్పిండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.