
అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రానికి 'డేర్ డెవిల్' అని పేరు ఖరారు చేశారు.
ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలిని అజిత్ కుమార్ బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.