
మురసు తుఫాన్ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలోని 17 జిల్లాల కలెక్టర్లకు సహాయ చర్యలు, తక్షణ ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.37 కోట్లు విడుదల చేసింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, తుఫాన్ ప్రభావంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాలు, వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండి ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.