
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ 'S1Z'ను భారత విపణిలోకి విడుదల చేసింది.
ఈ కొత్త స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 301 కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది.
ఈ వాహనంలో ఓలా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ సెల్ ఎల్‌ఎఫ్‌పీ (LFP) టెక్నాలజీని వినియోగించినట్లు సమాచారం.